విశేషాలు

Entertainment

Fashion

Techonlgy

How To Send Many Photos In Whatsapp


ఒకే సారి వాట్స్ అప్ లో వందల కొద్ది ఫొటోస్ పంపించాలా..!

మనం ఎదన్న ఫొటోస్ షేర్ చెయ్యాలి అనుకున్నప్పుడు వాట్స్ అప్ లో ఒకే సారి 10 ఫొటోస్ కి మించి పంపించలేము అల కాకుండా వందల కొద్ది ఫొటోస్ ఒకే సారి పంపించాకలిగితే..
ఒకే సారి వాట్స్ అప్ లో ఎక్కువ ఫొటోస్ ఎలా పంపించాలో ఈ వీడియో టెక్నిక్ ఫాలో అవ్వండి.

  

వీడియో క్రెడిట్ : నల్లమోతు శ్రీధర్.

Pocket Thieves In Ys Jagan Mohan Meetingవైఎస్ జగన్ మీటింగ్ లో దొంగల చేతివాటం....... 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పొగాకు వేలం కేంద్రంలో పొగాకు రైతులతో బుధవారం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొగాకు వేలం కేంద్రంలో జగన్ ని చూసేందుకు అభిమానులు కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో తీవ్ర తోపులాట జరిగింది.  . ఇదే అదనుగా భావించిన దొంగలు తమ పని కానించేసారు. ఇంకేముంది సెల్ ఫోన్స్ , పర్సులు ,డబ్బులు , ఏటిఎమ్ కార్డ్స్ మాయం.పోయిన సొత్తు విలువ సుమారు 200,000/- వరకు ఉంటుందని బాధితులు చెప్తున్నారు.

Election Commission Rejected 191 Local Party's In Mumbai Local Elections


మహారాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఎంఐఎంతో సహా 191 స్థానిక పార్టీల రిజస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఆదాయ పన్ను రిటర్నులు, ఖాతాల వివరాలు సమర్పించకపోవడమే దీనికి కారణమని ఈ.సి తెలిపింది.ముంబై మహానగర ఎన్నికలు, ఇతర స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఎంఐఎంకు ఈ పరిణామం ఎదురు దెబ్బే ఎన్నికల నియమావళిని అనుసరించి కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవమేనని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.


ప్రపంచ పెద్దావిడ కన్నుమూసింది

న్యూయార్క్: ప్రపంచ పెద్దావిడ కన్నుమూశారు. న్యూయార్క్ కు చెందిన సుసనాహ్ ముసాత్ జోన్స్(116) అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఈమె చనిపోవడంతో ప్రస్తుతం ప్రపంచ కురువృద్ధ మహిళగా ఆమె పేరిట ఉన్న రికార్డు ఇటలీ మహిళ ఎమ్మా మారనో-మార్తినుజి(116)కి వెళ్లనుంది. సౌతర్న్ అమెరికాలోని అలబామాలో 1899లో జన్మించిన జోన్స్ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1922లో నార్త్ కు న్యూయార్క్ కు వెళ్లింది. తొలుత హౌజ్ కీపర్, చైల్డ్ కేర్ టేకర్ గా పనిచేసింది. ఆ తర్వాత గిన్నీస్ బుక్ లో ప్రపంచ వృద్ధ మహిళగా చోటుదక్కించుకుంది. ఆమె ఇంతకాలం జీవించడానికి గల కారణాలు గతంలో తెలుసుకోగా బాగా నిద్రపోవడం.. అస్సలు పొగ, మద్యం తాగకపోవడం అని చెప్పింది.

సినిమాలు,పార్టీలు,ఫంక్షన్లు,మొదలేనవి ప్లాన్ చెయ్యండి ఇ అప్ తో!సినిమాలు,పార్టీలు,ఫంక్షన్లు,మొదలేనవి ప్లాన్ చెయ్యాలంటే ఇంకా అందరికి ఫోన్ చేసి వెళ్దామ అని అడగకుండా కేవలం ఇ అప్లికేషను ద్వార ప్లాన్ చయ్యండి.
 అప్ నేమ్ : Are You In ?
అప్ లింక్: https://goo.gl/zfSxQh

నోకియా బ్లూటూత్ కేవలం 499/- మాత్రమే కొద్దికాలపు ఆఫర్ !


Nokia Bh-108 Bluetooth Headset కేవలం 499/- మాత్రమే
 అస్క్ మీ బజార్ ఆన్లైన్ వెబ్ సైట్ ఇస్తున్న ఆఫర్ కేవలం 499/- కే Nokia Bh-108 Bluetooth Headset
ఆఫర్ పొందే విధానం
 1)ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి
 2)ప్రోడక్ట్ ని Buy చెయ్యండి
 3)పేమెంట్  చెయ్యండి !


100/- రీఛార్జి ఫై పొందండి 20/- ఉచితంగా freecharge.com తో.ప్రతి 100/- రీఛార్జి ఫై 20/- ఉచితంగా పొందండి కేవలం జనవరి 31 వరకు మాత్రమే
ఆఫర్ కేవలం ఫ్రీ ఛార్జ్ అప్ ఫైన మాత్రమే లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి.

చిన్న విషయం పెద్ద హడావిడి !


కొంతమంది పాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం. అయితే తమ గాత్ర మాధుర్యం ఎంత అసహ్యంగా ఉంటుందనేది ఆ పాడేవారికి తెలియదు. నెదర్లాండ్స్ లో ఇలాంటి ఓ వ్యక్తి గొంతు విన్న ఇరుగుపొరుగు వారు ఏకంగా ఇంట్లో గృహహింస జరుగుతోందని భావించి పోలీసులకు ఫోన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ అపార్ట్ మెంట్ వాసులకు మంగళవారం రాత్రి ఓ భయంకరమైన గొంతు వినిపించింది. ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయా అని గమనించిన వారు ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో నుండి వస్తున్నట్లు గుర్తించారు. అంతే.. అక్కడ గలాటా జరుగుతున్నట్లు భావించి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లోపలివారు ఎంతకీ ఫ్లాట్ డోర్ తీయకపోవటంతో.. డోర్ బద్దలు కొట్టి మరీ లోపలకు ప్రవేశించి అక్కడ సీన్ చూసి షాక్ అయ్యారు. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వ్యక్తి ఓ రేంజ్ లో పాటలు పాడుతూ కనిపించాడు.పోలీసులు లోపలికి వచ్చింది కూడా గమనించకుండా ఆ వ్యక్తి తన గానామృతం కొనసాగిస్తునే ఉన్నాడు. ఎట్టకేలకు పోలీసులు కనిపించడంతో ఏం జరిగిందో తెలుసుకున్న ఆ వ్యక్తి తన గాన మాధుర్యానికి లోలోపల నవ్వుకున్నాడు. ఆ వ్యక్తిపై ఇంతకు ముందు ఎలాంటి ఫిర్యాదులు, కేసులూ లేవు. ఇరుగుపొరుగులు ఇచ్చిన సమాచారంతో హంగామా సృష్టించిన పోలీసులూ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తలుపులు విరగ్గొట్టి మరీ పాటలు పాడుకుంటున్న వ్యక్తిని పట్టుకున్నందుకు కొద్దిసేపు నవ్వుకుని ..వెనుదిరిగారు.

గబ్బర్ సెట్లో మెగా స్టార్ !


పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం బ్రహ్మకడలి కళా దర్శకత్వంలో దాదాపు రూ.5 కోట్ల వ్యయంతో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ జరుగుతున్న స్పాట్‌కి.. మెగాస్టార్ చిరంజీవి వెళ్లి చిత్రయూనిట్‌తో కాసేపు సరదగా ముచ్చటించారు. ఈ విషయాన్ని సర్దార్‌ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న కబీర్ దుహన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా ఫోటో షేర్ చేస్తూ తెలిపాడు. ఏది ఏమైనా మెగాస్టార్ షూటింగ్ స్పాట్ కి వెళ్ళడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది..

పాత బ్రౌజర్లకు స్వస్తి : మైక్రో సాఫ్ట్
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఇంటర్నెట్ ఎక్సప్లోరర్ ఓల్డ్ వెర్షన్స్ కు సెక్యూరిటీ నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది ఈ మేరకు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 8, 9, 10 వెర్షన్లకు టెక్నికల్, సెక్యురిటీ సపోర్ట్ ను నిలిపివేస్తూ మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లను ప్రోత్సహించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకమీదట పాత వెర్షన్లను ఉపయోగించే యూజర్లకు ఎటువంటి టెక్నికల్, సెక్యురిటీ అప్డేట్స్ ను సంస్థ అందించదు. దీంతో యూజర్లు హ్యాకర్ల బారిన పడే అవకాశాలు పెరుగడమే కాకుండా బ్రౌజింగ్ కూడా సరిగ్గా ఉండదు. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరార్ 8, 9, 10 వెర్షన్ లను ఉపయోగించే యూజర్లు.. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరార్ 11, మైక్రోసాఫ్ట్ ఎడ్జి లకు అప్డేట్ కావాలని సంస్థ ప్రకటించింది. 2002లో ప్రపంచ మార్కెట్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ వినియోగదారుల వాటా 85 శాతంగా ఉండేది. అయితే గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్,ఓపెరా వినియోగదారులు పెరుగుతుండటంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ల వినియోగదారుల వాటా గత సంవత్సరానికి 6.8 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ 11 వెర్షన్లతో ప్రపంచమార్కెట్లో మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ల వినియోగదారుల సంఖ్య పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది.ఐతే గత అనుభవాల రిత్య ఇప్పుడు ఉన్న ఫాస్ట్ ప్రపంచానికి అనగుణంగా అప్డేట్స్ ఇవ్వాలని ఇంటర్నెట్ యూసర్ లు కోరుతున్నారు.
 
Back To Top
Copyright © 2016 Telugu Hunt. Designed by Ganesh Team